Raghunandan Rao Sensational Comments On Rahul Gandhi

రాహుల్​గాంధీ కులమేంటో చెప్పండి : రఘునందన్

హైదరాబాద్‌: ప్రధాని మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు స్పందించారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్​ బీసీ అని సీఎం వ్యాఖ్యానించారు. ముందు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తన కులమేంటో చెప్పాలని రఘునందన్​ డిమాండ్​ చేశారు. ప్రధాని మోడీ మంత్రివర్గంలో 19 మంది బీసీలు ఉంటే.. రేవంత్​ మంత్రివర్గంలో కేవలం ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు. ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని రఘునందన్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

రాహుల్ ​గాంధీ కులమేంటో చెప్పండి

కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని, అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు. అసలు నరేంద్ర మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోడీ కులం ఓసీ నుండి బీసీకి మారిందని ఇప్పుడే కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కాగా, నరేంద్ర మోడీ పుట్టికతోనే బీసీ కాదు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడారు. కేసీఆర్ లాంటి బలిసిన నేతలు సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ ఒక్క రోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదన్నారు. మా లెక్కలు తప్పు పడితే బీసీలు శాస్వతంగా నష్టపోతారు. కులగణన పై ప్రణాలిక ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే కులగణన చేశామని తెలిపారు.

Related Posts
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
Another sensational decisio

అమెరికా అధ్యక్షా పదవి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఆయన ఉత్తర్వులు జారీ Read more

ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్
si and constable

గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్ Read more

కిరణ్ రాయల్ పై ఆరోపణలు లక్ష్మి అరెస్ట్..
కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్..

తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి Read more

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
TDP candidates who have fil

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి Read more