PV Sindhu Bhoomi Puja for Badminton Academy in Visakha

విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన పీవీ సింధు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. ఇక్కడ సుమారు మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది.

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ..పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయ‌ని, అకాడ‌మీ నిర్మాణానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వైజాగ్‌లో బ్యాడ్మింట‌న్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ‌ని ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వ స‌హకారంతో బ్యాడ్మింట‌న్‌పై ఆస‌క్తి ఉన్న యువ‌తీ, యువ‌కుల‌కు అద్భుత‌మైన శిక్ష‌ణ ఇస్తామ‌ని సింధు తెలిపారు. త‌ద్వారా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్ల‌ను త‌యారు చేసి, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెడ‌ల్స్ గెలిచేలా త‌యారు చేస్తామ‌ని అన్నారు.

Related Posts
మైక్ టైసన్ vs జేక్ పాల్ పోరాటం: నెట్‌ఫ్లిక్స్ క్రాష్
jake paul vs mike tyson

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తిరిగి పోరాటం చేయబోతున్నారని ఎన్నో నెలలుగా ఎదురు చూసిన అభిమానులు, చివరికి భారీ నిరాశను అనుభవించారు. అయితే, ఈ పోరులో ఆయనకు Read more

2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ను ప్రకటించిన ఐఎండీబీ
IMDb Announces Most Popular

ముంబై-డిసెంబర్ 2024 : IMDb (www.imdb.com) సినిమాలు, టీవీ మరియు ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి నేడు 2024 టాప్ 10 Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

మణిపూర్ హింస..ఉన్నతాధికారులతో అమిత్ షా అత్యవసర భేటీ
Manipur violence.Amit Shah emergency meeting with high officials

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ లో నెలకున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *