మరోసారి తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం

Puri Ratna Bhandar was opened once again

భువనేశ్వర్‌ : ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భాండాగారాన్ని గురువారం మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది.

కాగా, పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం గత ఆదివారం తెరచుకుంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఈ రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు. ఈ పూరీ రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.