ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో దూసుకెళ్తున్న ‘ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్’

ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు పెరిగిపోవడానికి తోడు కాలుష్య నివారణ దిశగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోపక్క కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడంతో అనేక ప్రముఖ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గు చూపిస్తూ..మార్కెట్ లోకి సరికొత్త లుక్ లో ..అనేక ఫీచర్స్ తో విడుదల చేస్తున్నాయి. అలాంటి సంస్థల్లో ‘ ‘ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్’ ఒకటి.

ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ని ప్రారంభించేందుకు ప్రణాళికలు వెల్లడంచింది. ప్రస్తుతం వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతున్న ఈ కంపెనీ.. స్థిరమైన ఆర్థిక లాభాలతో ముందంజలో ఉంది. గత మూడేళ్లుగా లాభాల్లో ఉన్న ఈ కంపెనీ.. FAME సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించడం విశేషం. 85 శాతం వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో స్థిరంగా లాభాలను అర్జిస్తున్నట్లు ప్యూర్ ఈవీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌తో సహా ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో కంపెనీ బలమైన పెట్టుబడిదారుల పూర్తి నమ్మకాన్ని పొందినట్లు సంస్థ చెప్పుకొచ్చింది. అంతర్గత బ్యాటరీ తయారీ, దాని పవర్‌ట్రెయిన్, సాఫ్ట్‌వేర్ యొక్క బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌తో, ప్యూర్ ఈవీ 120 మేధోపరమైన లక్షణాలను పోర్ట్‌ఫోలియోను కలిగిఉందని పేర్కొంది. రాబోయే నాలుగేళ్లల్లో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో, ప్యూర్ ఈవీ మాస్ కమ్యూట్ మార్కెట్లో వ్యూహాత్మకంగా స్థానం పొందుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

2025 భారత్‌ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందంగా ఉందని,
ప్యూర్ ఈవీ యొక్క సీఈవో రోహిత్ వదేరా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ రవాణా యొక్క భవిష్యత్తు, ప్యూర్ ఈవీనేనని తాము విశ్వసిస్తున్నామన్నారు. తమ వినూత్న A I ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్‌సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందేందుకు తమకు అనుమతి లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్యూర్ ఈవీకి ప్రాంతీయ రవాణా కార్యాలయం స్థాయిలో 7 శాతం మార్కెట్ వాటా ఉందని.. భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2 నగరాల్లో విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భారత్‌లో విక్రయించే ద్విచక్ర వాహనాలలో 65 శాతం వాటా ప్యూర్ ఈవీ మోటార్‌ సైకిళ్లదేనని అన్నారు.

ప్యూర్ ఈవీ సంస్థను 2019లో ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులైన నిశాంత్ దంగోరి, రోహిత్ వడేరాలు స్థాపించారు. ప్రముఖ సంస్థలు చాలానే ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 201 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ ప్లూటో 7G మాక్స్, ఎంట్రెన్స్ నియో ప్లస్, ఈటైరిస్ట్ ఎక్స్, ఈకో డ్రిఫ్ట్ వంటి ప్రముఖ మోడల్స్ ఉన్నాయి.