హత్య కేసు..డేరాబాబాకు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఊరట

dera-baba

న్యూఢిల్లీః డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా .. తన మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ నిర్దోషిగా బయటపడ్డాడు. రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో గుర్మీత్‌ నిర్దోషి అని పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రకటించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురు దోషులను కూడా హైకోర్టు దోషులుగా పేర్కొంది. కింది కోర్టు ఆ ఐదుగురిని దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

డేరా బాబా దగ్గర మేనేజర్‌గా పనిచేసిన రంజిత్‌ సింగ్‌ 2002 జూలై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్‌పూర్‌ కొలియన్‌ గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా చంపేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ.. 2007లో ఆరుగురు నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2008లో అభియోగాలు నమోదు చేయగా.. 2021 అక్టోబర్‌ 1న కింది కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది.

ఇప్పుడు పంజాబ్‌-హర్యానా హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆ కోర్టు దోషులుగా నిర్ధారించిన ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా డేరా బాబాపై ఈ హత్యకేసు మాత్రమేగాక తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడట్లుగా కేసు ఉంది. ఈ కేసులో గర్మీత్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో గత నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్న ఇప్పటికే ఏడు సార్లు పెరోల్‌పై బయటికి వచ్చాడు.