Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే..

హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్‌ తో ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించి, ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టాలని కోరారు.

image

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన బీసీ నేతల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టపరంగా కల్పించాలి తప్ప, పార్టీపరంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పార్టీ పరంగా ఇచ్చేందుకు మేమేమైనా బిచ్చగాళ్లమా? అని నిలదీశారు. ‘రాజ్యాంగం ప్రకారం మా వాటా మాకిచ్చి తీరాల్సిదే.. లేకుంటే రాష్ర్టాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు.

బీసీ భవన్‌లో 14 బీసీ సంఘాలు 30 కులసంఘాలతో కలిసి రిజర్వేషన్లపై చర్చించామని తెలిపారు. గత సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూ పి రిజర్వేషన్లకు మొండిచేయి చూపుతామంటే సహించబోమని స్పష్టంచేశారు. వెంటనే సీఎం అఖిలపక్షం స మావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని పార్టీల నిర్ణయాలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీలకు అన్యా యం తలపెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతుచూస్తామని తీవ్ర స్థాయిలో హె చ్చరించారు. బీసీ నేతలు వేముల రా మకృష్ణ, గొరిగే మల్లేశ్‌, నందగోపాల్‌, బీసీ మహిళా నేత కీర్తిలతాగౌడ్‌, మోడీ రామ్‌దేవ్‌, శివ, రవియాదవ్‌, జయంతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Posts
నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren took oath as Jharkhand CM today

రాంచీ: నేడు జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంగా అట్టహాసంగా జరగబోతోంది. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం Read more

ఫిష్ వెంకట్ కు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
Fish venkat

టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్థికంగా అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం పవన్ Read more

నేడు ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
నేడు ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు ఫ్రంట్లైన్ నావికా యుద్ధ విమానాలు-ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాఘ్షీర్-ను బుధవారం ముంబై లోని నావికా Read more

సత్తుపల్లి (శ్రీ చైతన్య స్కూల్ ) విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయి గుర్తింపు
sattupalli c batch

సత్తుపల్లిలోని సత్తుపల్లి విద్యాలయం ( శ్రీ చైతన్య స్కూల్ )కు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగిన కైట్ (KAT) లెవెల్-2 ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపించి పాఠశాలకు Read more