విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం ఫై విద్యార్థుల భారీ నిరసన

గురువారం తెలంగాణ అసెంబ్లీ లో 2024 -25 కు సంబధించి వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.2 లక్షల 91 వేల 59 కోట్ల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టారు. అయితే విద్యారంగానికి నిధులు కేటాయించపోవడం ఫై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులను కాంగ్రెస్‌ సర్కారు దగా చేయడంపై విద్యార్థులు, నిరుద్యోగులు రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్‌ఎయూ, పీవైఎల్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.