Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు.. ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

కాగా, ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్‌ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్‌ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు.

Related Posts
ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more

రాజాసింగ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల తొలగింపు
Deletion of Raja Singh Facebook and Instagram accounts

హైదరాబాద్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు చెందిన 2 ఫేస్‌బుక్‌ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించడంపై ఆయన ఎక్స్‌ లో స్పందించారు. Read more

Uttar Pradesh: రంజాన్ వేళ మీరట్ పోలీసులు హెచ్చరికలతో ముస్లిం పెద్దలు ఆగ్రహం..
Uttar Pradesh: రంజాన్ వేళ మీరట్ పోలీసులు హెచ్చరికలతో ముస్లిం పెద్దలు ఆగ్రహం..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో ప్రార్థనలు చేయరాదని, ఎవరైనా ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు Read more

ఏపీ ప్రభుత్వం.. వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు
AP government.. More services through WhatsApp

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చిన సేవల సంఖ్య రెండు వందలకు చేరుకుంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని Read more

×