‘ప్రిజన్ టు ప్రైడ్’ దశ 8, ‘నయీ దిశా – స్మైల్ ఫర్ జువెనైల్’ ఫేజ్ 5 ప్రారంభం

ఇండియన్ ఆయిల్ జైలు ఖైదీలు, జువెనైల్ కోసం..

‘Prison to Pride’ phase 8, ‘Nayi Disha – Smile for Juvenile’ phase 5 begins

హైదరాబాద్: ఖైదీలు, బాల నేరస్తులలో పరివర్తన ప్రయత్నంలో భాగంగా ఇండియన్ ఆయిల్ ‘పరివర్తన్ – ప్రిజన్ టు ప్రైడ్’ ఎనిమిదో దశను, ‘నయీ దిశ – స్మైల్’ ఐదో దశను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య మాట్లాడుతూ.. ఈ దశలో ఇండియన్ ఆయిల్ 22 జైళ్లు, జువైనల్ హోమ్‌లలో వెయ్యి మందికి పైగా వ్యక్తుల జీవితాలను స్పృశించనున్నామని తెలిపారు. ఈ రోల్ అవుట్‌తో ఇండియన్ ఆయిల్ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలు, బాల్య జీవితాల్లో స్పోర్ట్స్ కోచింగ్, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘పరివర్తన్’, ‘నయీ దిశ’ ద్వారా కొత్త జీవితంలోనికి అడుగు పెట్టేందుకు ఖైదీలకు రెండో అవకాశాన్ని అందించడానికి క్రీడలను సద్వినియోగం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఇండియన్ ఆయిల్ ‘నేషన్ ఫస్ట్’కు ఉదాహరణగా ఉన్నాయన్నారు.

ఇండియన్ ఆయిల్ ‘ఉమీద్ – ఏ హోప్’ ప్రాజెక్ట్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. రాష్ట్ర జైళ్ల శాఖల సహకారంతో ఇప్పటికే 53 ఇంధన స్టేషన్లను ప్రస్తుత, మాజీ ఖైదీలచే నిర్వహించబడుతున్నామని తెలిపారు. ఖైదీల కోసం వరల్డ్ చెస్ ఫెడరేషన్ (ఎఫ్ఐడీఈ) నిర్వహించిన ఇంటర్‌కాంటినెంటల్ ‘చెస్ ఫర్ ఫ్రీడమ్’ ఆన్‌లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పూణేలోని యెరవ్డా జైలులోని ఖైదీలు గోల్డ్ మెడల్స్ (ఓపెన్ కేటగిరీ), భోపాల్ జువెనైల్ సెంటర్ (యూత్ కేటగిరీ) గెలుచుకున్నారని తెలిపారు.

ఈ సామాజిక ప్రయోజనాల కోసం స్పోర్ట్‌స్టార్ ఏసెస్ ఛైర్‌పర్సన్ అవార్డు 2023, థాట్ లీడర్‌షిప్ కోసం ప్రతిష్టాత్మక ఆసియా-పసిఫిక్ స్టీవ్ అవార్డులను కూడా అందుకుంది. 2023లో చికాగోలో జరిగిన చెస్ ఫర్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్‌లో వరల్డ్ చెస్ ఫెడరేషన్ కూడా దీనిని గుర్తించింది. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్యకు ప్రపంచ చెస్ సమాఖ్య ‘ఫ్రెండ్ ఆఫ్ ఫిడే’ అనే ప్రతిష్టాత్మక బిరుదును అందించింది. ఈ అవార్డు భారతదేశంలో సామాజిక పరివర్తనకు సాధనంగా చెస్ ఫర్ ఫ్రీడమ్ ప్రోగ్రామ్, క్రీడలను ప్రోత్సహించడంలో ఇండియన్ ఆయిల్ విలువైన సహకారాన్ని గుర్తిస్తుంది. ‘పరివర్తన్-ప్రైజన్ టు ప్రైడ్’ కార్యక్రమం ఆగస్టు 15, 2021న ప్రారంభించబడింది. అయితే, మొదటి దశ ‘నయీ దిశ – స్మైల్ ఫర్ జువెనైల్’ జనవరి 26, 2023న ప్రవేశపెట్టబడింది.