10వ తేదీన వాయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Kerala incident..Prime Minister Modi announces ex gratia
Prime Minister Modi will visit Wayanad on the 10th

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఎల్లుండి(ఆగస్టు 10వ తేదీన) వాయనాడ్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వాయనాడ్‌ ఏరియల్ సర్వే చేయనున్నారు ప్రధాని మోడీ. ఆగస్టు 10వ తేదీన, మధ్యాహ్నం 12 గంటలకు వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ప్రధాని మోడీ పరిశీలించనున్నారని సమాచారం. కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌ను సందర్శించి, గత నెలలో దక్షిణాది రాష్ట్రాన్ని తాకిన విపత్తు నుండి బయటపడిన వారితో సంభాషించనున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే… ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక విమానంలో కన్నూర్‌లో దిగనున్నారు. కన్నూరు నుంచి ప్రధాని మోడీ హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రస్తుతం 10,000 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్న కొన్ని సహాయ శిబిరాలను ఆయన సందర్శిస్తారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు…. ప్రధాని మోడీ కన్నూర్‌కు వచ్చిన తర్వాత ఆయన వెంట వస్తారని భావిస్తున్నారు. కాగా, ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.