PM Modi will visit Gujarat today and tomorrow

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇకపోతే..ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

Related Posts
విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన
MPs of INDIA Alliance prote

శీతాకాల సమావేశాల చివరి రోజున కూడా పార్లమెంటు వేదికపై ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇండియా కూటమి ఎంపీలు విజయ్ చౌక్ వద్ద నిరసనకు దిగారు. అంబేడ్కర్ పై అమిత్ Read more

చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు – అంబటి
ambati chiru

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని చిరంజీవి చేసిన ప్రకటనపై అంబటి Read more

శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి
Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా Read more

రానిటిడిన్: USలో నిషేధం భారత్‌లో అమ్మకం
రానిటిడిన్: USలో నిషేధం భారత్‌లో అమ్మకం

రానిటిడిన్ అనే గుండెల్లో మంట తాగించే మందు, NDMA (ఎన్-నైట్రోసోడిమెథైలమైన్) అనే సంభావ్య క్యాన్సర్ కారక మలినాలతో సంబంధం ఉండదన్న కారణంగా USలో నిషేధించబడింది. అయితే, భారతదేశంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *