Prime Minister Modi is going to visit America.

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!

వాషింగ్ట‌న్‌: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న సమాచారం. ఫిబ్ర‌వ‌రిలో మోడీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్య‌క్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో.. సోమ‌వారం ప్ర‌ధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాష‌ణ గురించి ట్రంప్ వెల్ల‌డించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో వెళ్తున్న స‌మ‌యంలో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడారు. భార‌త ప్ర‌ధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడ‌న‌ని, ఆయ‌న వైట్‌హౌజ్‌కు రానున్నార‌ని, బ‌హుశా ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న శ్వేత‌సౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్న‌ట్లు తెలిపారు. ఇండియాతో త‌మ‌కు మంచి రిలేష‌న్ ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisements
image

ప్రధాని మోడీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. తొలి సారి దేశాధ్య‌క్షుడిగా చేసిన స‌మ‌యంలో.. ట్రంప్ త‌న చివ‌రి ప‌ర్య‌ట‌న ఇండియాకే వ‌చ్చారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉన్న‌ది. 2019లో హూస్ట‌న్‌లో జ‌రిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్ర‌వ‌రిలో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

కాగా, ట్రంప్‌- మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోడీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

Related Posts
TGRTC: త్వ‌ర‌లో టీజీఆర్‌టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్
TGRTC: త్వ‌ర‌లో టీజీఆర్‌టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్

అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో కీలక ప్రకటన అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక ప్రకటనను విడుదల చేసింది. Read more

Crime News :క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త
క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ Read more

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి Read more

కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
Manmohan Singh

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవడం తెలిసిందే. మన్మోహన్ భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీలోని Read more

Advertisements
×