presidents rule has been revoked in jammu and kashmir by ministry of home affairs

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. నోటిఫికేషన్ విడుదల

శ్రీనగర్‌: ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం పొద్దుపోయాక అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు అయిందని, తద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. అక్టోబర్ 31, 2019న జారీ చేసిన మునుపటి ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వివరించింది. ఈ మేరకు విడుదల చేసిన గెజిట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు.

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని సెక్షన్ 54 ప్రకారం ముఖ్యమంత్రి నియామకానికి ముందు అక్టోబర్ 31, 2019 నాటి రాష్ట్ర పాలనకు సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేశామని గెజిట్ ఉత్వర్వులో ప్రభుత్వం పేర్కొంది. కాగా ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగిన విషయం తెలిసిందే.

Related Posts
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
BJP slams Rahul Gandhi

ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనని Read more

రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌..
By election polling in Milkipur and Erode (East) constituencies in Tamil Nadu

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 247 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌‌, Read more

నూతన షోరూమ్‌తో కార్యకలాపాలను విస్తరించిన ప్యూర్ ఈవీ
Pure EV expands operations with new showroom

హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ , ఈరోజు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద షోరూమ్‌లలో ఒకదానిని ప్రారంభించినట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌లో Read more

కెనడా: యూరేనియంతో న్యూక్లియర్ ఎనర్జీ “సూపర్ పవర్”గా మారే అవకాశాలు
Canada Takes the Forefront in the Nuclear Energy Surge

న్యూక్లియర్ ఎనర్జీపై మరింత దృష్టి పెడుతున్న నేపథ్యంలో, యూరేనియం ప్రాముఖ్యత మళ్లీ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు సంక్షోభం పరిష్కారానికి న్యూక్లియర్ ఎనర్జీ ఒక పరిష్కారం కావచ్చు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *