President's refusal to meet with farmers' association

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు పరిష్కారం చూపేందుకు జోక్యం చేసుకోవాలని కోరేందుకు రాష్ట్రపతి ముర్ముతో భేటీకి ఎస్కేఎం ప్రతినిధులు సోమవారం సమయం కోరారు. సమయం కేటాయించాలని కోరుతూ తాము చేసిన అభ్యర్థనకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చినందుకు ఎస్కేఎం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపింది.

image
image

సమయాభావం కారణంగా రైతుల ప్రతినిధులను కలుసుకోవడానికి ఆమె నిరాకరించడం పట్ల ఎస్కేఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు పరిష్కరించలేక పోయిన ఈ ప్రతిష్టంభనను తొలగించి, గత 41 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ప్రాణాలను కాపాడేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టేందుకు వీలుగా రైతుల ఆందోళన విషయంలో జోక్యం చేసుకోవాలన్న తమ అభ్యర్థనను రాష్ట్రపతి భవన్‌ సమీక్షించగలరని ఎస్కేఎం ఆశాభావం వ్యక్తం చేసింది. సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని పేర్కొంది.

Related Posts
అట్టహాసంగా నాగ చైతన్య – శోభిత వివాహం
chaitu shobitha wedding

డిసెంబర్ 04 బుధువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య - శోభితల వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి Read more

ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

వారణాసికి చెందిన అనన్య, విశాల్ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే అనన్య తల్లిదండ్రులు ఈ ప్రేమను అంగీకరించకుండా, ఆమెను మరో వ్యక్తికి వివాహం చేశారు. కానీ అనన్య Read more

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
Relief for Mohan Babu in the Supreme Court

ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more