droupadi murmu

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. ఇందులో అభివృద్ధితో పాటు సంస్కరణల వేగం పెంచాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. అలాగే స్వదేశీ ప్రాధాన్యంతో కేంద్రం చేపడుతున్న పలు కార్యక్రమాలను, పథకాలను వివరించారు. అదే సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టునూ ఆమె ప్రస్తావించారు. ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పదేళ్లలో రెండుసార్లు కేంద్రంలో మోడీ సర్కార్ పలు మార్లు నిధులు కూడా కేటాయించింది.

అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. అంతే కాదు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రపతి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు.

Related Posts
శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి
శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి

శివరాత్రి ఉత్సవాల కోసం శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లలో దురదృష్టవశాత్తు ఒక విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ కార్మికుడు ఒక తీవ్ర ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మహాశివరాత్రి Read more

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం Read more

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ విడుదల
Maharashtra and Jharkhand assembly election schedule released

న్యూఢిల్లీ: మహారాష్ట్ర లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!

వివరాల్లోకి వెళ్ళగా నటుడు మరియు దాత సోను సూద్ మరొకసారి ఆయన సేవ హయధేయన్ని చాటుకున్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *