అమరవీరుల త్యాగాలు మరువలేనివి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Murmu pay tributes to Kargil war heroes

న్యూఢిల్లీ: నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘భారత దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక ఈ కార్గిల్ దివస్. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భరతమాతను రక్షించే క్రమంలో ప్రాణ త్యాగం చేసిన ప్రతి సైనికుడికీ నేను నివాళులర్పిస్తున్నా. యుద్ధంలో వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేం. ఆ పరాక్రమం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతూనే ఉంటారు. జై హింద్.. జై భారత్’ అని ముర్ము ఎక్స్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. . కాగా, 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు.