Prashant Kishor hunger strike broken.. Forced transfer to AIIMS

ఎయిమ్స్‌కు ప్రశాంత్ కిషోర్ తరలింపు

పాట్నా: బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారి విద్యార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2న దీక్షను ప్రారంభించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులకు వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆయనను తరలించారు. దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించడంతోపాటు, పార్టీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గాంధీ మైదానం వద్ద గందరగోళం ఏర్పడింది.

Advertisements

కాగా, డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. ఇక, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేయడం వివాదాస్పదమైంది. కోట్ల విలువైన ఈ వాహనంలో కిచెన్, బెడ్ రూమ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వల్ల ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలపై అనుమానాలు, విమర్శలు వచ్చాయి.

Related Posts
రాజారెడ్డి ఐ సెంటర్ న్ను ప్రారంభించిన జగన్
Raja Reddy Eye Center

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. Read more

నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు
chandrababu davos

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర అధికారుల బృందం కూడా Read more

మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు
Another case against former minister Harish Rao

కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత Read more

రైత‌న్న‌ల‌కు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్
telangana govt farmer

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించే పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పాత కాలంలో రైతులు Read more

×