Prashant Kishor hunger strike broken.. Forced transfer to AIIMS

ఎయిమ్స్‌కు ప్రశాంత్ కిషోర్ తరలింపు

పాట్నా: బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారి విద్యార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2న దీక్షను ప్రారంభించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులకు వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆయనను తరలించారు. దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించడంతోపాటు, పార్టీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గాంధీ మైదానం వద్ద గందరగోళం ఏర్పడింది.

కాగా, డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. ఇక, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేయడం వివాదాస్పదమైంది. కోట్ల విలువైన ఈ వాహనంలో కిచెన్, బెడ్ రూమ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వల్ల ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలపై అనుమానాలు, విమర్శలు వచ్చాయి.

Related Posts
హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీ తరహాలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో Read more

సైఫ్ అలీఖాన్ పై దాడి
Attack on Saif Ali Khan

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో వెన్తనె కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం Read more

యూఎస్ పౌరసత్వం కోసం “గోల్డ్ కార్డ్” వీసాలు
యూఎస్ పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్" వీసాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెబుతూ.. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్‌ను Read more

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..
Arrest warrant issued against former Prime Minister of Bangladesh Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. Read more