మరోసారి తల్లి కాబోతోన్న బాపు బొమ్మ

బాపు బొమ్మ హీరోయిన్ ప్రణీత మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో చిన్న సినిమాల్లో నటించిన ప్రణీత … అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రెండవ హీరోయిన్ గా నటించి ఫుల్ పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఆమెకు బాగానే ఆఫర్లు వచ్చాయి. తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన ప్రణీత మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాలో కూడా కనిపించింది.

ఆఖరి సారిగా లెజెండరీ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ప్రముఖ నటి కృష్ణ కుమారి పాత్రలో కనిపించింది. 2021 లో పెళ్లి చేసుకున్న ప్రణీత సుభాష్ సినిమాల జోరు తగ్గించింది. 2022లో ఒక అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చిన ప్రణీత ..ఆ తర్వాత కొద్దీ రోజులు సినిమాలకి దూరం అయింది. మళ్లీ ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రణీత హిందీలో ఒక సినిమా, మలయాళం లో ఒక సినిమా చేసింది. అలాగే బుల్లితెర ఫై కూడా జడ్జ్ గా సందడి చేసింది. ఇక ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలిపి అభిమానుల్లో సంతోషం నింపింది. ఈ విషయాన్ని తెలిపేందుకు ఆమె బేబీ బంప్తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ ‘రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులకు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతున్నారు.