pranab mukherjee daughter

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తండ్రి దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన మరణానంతరం పార్టీ నుంచి కనీసం సంతాపం ప్రకటించకపోవడాన్ని ఆమె తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Advertisements

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా షర్మిష్ఠ స్పందించారు. ప్రణబ్ రాష్ట్రపతిగా మాత్రమే కాకుండా, పార్టీకి కూడా అసాధారణ సేవలందించారని పేర్కొన్నారు. మరణానంతరం నా తండ్రికి స్మారకమో లేక కనీసం సంతాపం ప్రకటించమని అడగకపోవడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఇవి ప్రధానులకు మాత్రమే అని చెప్పడం తనను మరింత బాధించిందని షర్మిష్ఠ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి సమాధానంగా ఆమె తన తండ్రి రాసిన డైరీస్‌ను ఉదహరించారు. కె.ఆర్. నారాయణన్‌కు సంతాపం ప్రకటించినప్పుడు పార్టీ తీరు ఎంతో విభిన్నంగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ మార్పును చూస్తుంటే దిగ్భ్రాంతి చెందుతున్నాను” అని ఆమె వివరించారు. ఈమె మాటలతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఊపందుకున్నాయి. ప్రణబ్ ముఖర్జీకి పార్టీలో ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రశ్నలు తలెత్తాయి. మున్ముందు పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకంపై నిరీక్షణ కొనసాగుతుండగా, షర్మిష్ఠ వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Related Posts
గుట్కా ఉమ్మి వేసిన ఎమ్మెల్యేపై స్పీకర్ సీరియస్..ఎక్కడంటే?
గుట్కా ఉమ్మి వేసిన ఎమ్మెల్యేపై స్పీకర్ సీరియస్..ఎక్కడంటే?

గుట్కా, పాన్ పరాగ్ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రాణాంతకమో చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటనలు రూపొందించి ప్రదర్శిస్తూ ఉంటుంది. దేశంలో గుట్కా, Read more

KTR: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నకేటీఆర్
KTR: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నకేటీఆర్

తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదపండితుల పంచాంగ శ్రవణం ప్రత్యేక ఆకర్షణగా Read more

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్: కేటీఆర్‌
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు , శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి జరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల Read more

YS Sharmila : పులి బిడ్డ పులిబిడ్డే.. వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్
A tiger cub is a tiger cub.. YS Sharmila sensational tweet

YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా Read more

×