Pradeep Machiraju: పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌తో యాంకర్‌ ప్రదీప్‌ సినిమా

anchor pradeep

ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై యాంకర్‌గా అపారమైన ప్రజాదరణ సంపాదించుకున్న వ్యక్తి యాంకర్లకు లభించిన క్రేజ్‌ కంటే ప్రదీప్‌కు ఉన్న గుర్తింపు ప్రత్యేకమని చెప్పడం అతిశయోక్తి కాదు బుల్లితెరపై తనకున్న స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని నటనపై ఉన్న మక్కువతో హీరోగా 30 రోజుల్లో ప్రేమకథ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టాడు ఈ చిత్రం ప్రదీప్‌కి నటుడిగా మంచి పేరు తెచ్చినప్పటికీ అనుకున్నంత బాక్సాఫీస్ విజయం సాధించలేదుప్రస్తుతం ప్రదీప్ తన రెండో సినిమా కోసం కష్టపడుతూ టీవీ షోల నుంచి కొంతకాలంగా దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాపైనే దృష్టి పెట్టాడు ఈ కొత్త చిత్రం ద్వారా ప్రముఖ కామెడీ షోలు జబర్దస్త్ వంటి పాపులర్ ప్రోగ్రామ్స్‌కు దర్శకత్వం వహించిన నితిన్ భరత్‌లు తొలిసారి దర్శకులుగా పరిచయం కాబోతున్నారు ఈ చిత్రానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్‌ నిర్ణయించారు ఇది పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం టైటిల్ కావడం విశేషంఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను ఇటీవల గురువారం రోజు విడుదల చేశారు ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది అలాగే యూత్‌కి నచ్చే మంచి ప్రేమకథను కూడా ఇందులో జోడించారు. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారుఈ చిత్రానికి సంగీతం రథన్ అందిస్తున్నాడు, ఈ కాంబినేషన్‌తో ప్రేక్షకులకు ఒక కొత్త తరహా అనుభవం ఇవ్వాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Asean eye media. Ghana launches mycredit score to improve access to credit and boost financial inclusion biznesnetwork. The technical storage or access that is used exclusively for anonymous statistical purposes.