ప్రభాస్ 25 మూవీకి ‘స్పిరిట్’ టైటిల్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన 25 మూవీ ని ప్రకటించారు. ప్రస్తుతం వరుస పాన్ చిత్రాలు చేస్తూ వస్తున్న ప్రభాస్..తన 25 వ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా గా ప్రకటించారు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ చిత్రాల‌తో సౌత్ , నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ మూవీ విడుద‌ల కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ లు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇక సందీప్ వంగా విషయానికి వస్తే.. రణభీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాతే ‘స్పిరిట్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.