Postponement of counseling for DSC teachers

డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌: డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే డీఎస్సీలో సెలెక్ట్‌ అయిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని జిల్లాల డాటా రాకపోవడంతోనే పోస్ట్‌పోన్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. కాగా, కౌన్సెలింగ్‌ బుధవారం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మెరిట్‌ సాధించిన అభ్యర్థులు తాము కోరుకున్న చోట కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

Related Posts
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదు – India Today సంచలన అధ్యయనం
tirumala laddu

తిరుమల లడ్డూ ప్రసాదం విషయమై India Today తన అధ్యయన ఫలితాలను బహిర్గతం చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలపై పరిశీలన జరిపిన అనంతరం, తిరుమల లడ్డూ Read more

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం: ట్రంప్
జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ట్రంప్

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు Read more

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
President and Prime Minister paid tribute to the Mahatma

President and Prime Minister paid tribute to the Mahatma న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని Read more

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు
Muslim groups met CM Chandr

అంతర్జాతీయ ముస్లిం లా బోర్డు మరియు పలు ముస్లిం సంఘాలు కేంద్రం ప్రతిపాదించిన వర్ఫ్ చట్టానికి సంబంధించి సవరణలను వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరాయి. ఈ సందర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *