PosaniKrishnaMurali :కంప్లీట్అయిన పోసాని సీఐడీ విచారణ

PosaniKrishnaMurali :కంప్లీట్అయిన పోసాని సీఐడీ విచారణ

నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి,జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరనుంది.దాదాపు నాలుగు గంటలపాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు.ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్‌ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో పోసానిని హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అయితే పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisements

పీటీ వారెంట్‌

దాంతో ఆయనను గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో సీఐడీ హాజరు పరిచింది. ఈ సందర్భంగా పోసానిని న్యాయమూర్తి విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా? అని ప్రశ్నించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగిందని పోసాని బదులిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు ఒకరోజు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే.

నాలుగు గంటల పాటు విచారణ

ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు విచారించారు.  అనేక అంశాలపై సీఐడీ పోలీసులు ఆయనను విచారించారు. అయితే, విచారణకు సమయం సరిపోలేదని.. మరికొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయని.. ఈ క్రమంలో మరోసారి కస్టడీకి ఇస్తే విచారణ పూర్తి చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది.

పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. అయితే పోసాని కృష్ణమురళి వివిధ సమయాల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌తోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లలో పోసానిపై పలువురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

Related Posts
Jagan: ముస్లిం సోదరులకు కూటమి నాయకులు జగన్ శుభాకాంక్షలు
Jagan: ముస్లిం సోదరులకు కూటమి నాయకులు జగన్ శుభాకాంక్షలు

ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప Read more

Amit shah: ఆయుధాలు మార్పును తీసుకురాలేవు – అమిత్ షా
ఆయుధాలు మార్పును తీసుకురాలేవు - అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం, నక్సలైట్లు పై జరుగుతున్న దాడులను వ్యాఖ్యానిస్తూ, ఆయుధాలు మరియు హింస మార్పును తెచ్చే సాధనంగా చూడలేదని, శాంతి, అభివృద్ధి మాత్రమే Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more

ఇక పై తిరుమల అన్నప్రసాదంలో వడలు ?
TTD introduced masala vada in Tirumala Annaprasadam?

తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×