త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన తమ్మారెడ్డి

చిత్రసీమలో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అంశం కాకరేపుతుంది. జానీ మాస్టర్ పై రేప్ కేస్ నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని , ఆ వ్యక్తి పేరు కూడా చెప్పి అందరినికి షాక్ ఇచ్చింది.

జానిమాస్టర్ పై కొనసాగుతున్న రేప్ ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ పై డైరెక్ట్ గా సంచలన ఆరోపణలు చేసారు నటి పూనమ్ కౌర్. గతంలో కూడా ఆయన పై ఒకింత పరోక్షంగా పలు విషయాలు ఆరోపించిన పూనమ్, గతంలో త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తే వారి నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ముఖ్యంగా తనకు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు టాలీవుడ్ కి చెందిన పెద్దలు ఎవరూ కూడా స్పందించలేదని ఆరోపించారు. కాగా త్రివిక్రమ్ పై డైరెక్ట్ గా ఆరోపణలు చేసిన పూనమ్ మ్యాటర్ పై టాలీవుడ్ లో ప్రకంపనలు రేగుతున్నాయి.

పూనమ్ చేసిన ఆరోపణలపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఆమెకు MAAకు ఏ సంవత్సరంలో, ఎందుకు ఫిర్యాదు చేసిందో తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే కంప్లెంట్ బాక్స్లో తన ఫిర్యాదు లెటర్ వేసి ఉంటే సరిపోయేది. ఇప్పటికైనా ఫిర్యాదు అందితే కచ్చితంగా చర్చిస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.