జానీని ‘మాస్టర్’ అని పిలవొద్దు – పూనమ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ పిర్యాదు నేపథ్యంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ జానీని ‘మాస్టర్’ అని పిలవద్దంటూ సూచించింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు.

అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. కాగా ఆమె గతంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్ ఫై కూడా ఈమె వేధింపుల ఆరోపణలు చేశారు.

గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసింది.డ్యాన్సర్‌ అయిన సదరు యువతి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు.. బాధితురాలి ఇంట్లోనే 3 గంటలు విచారించారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. జానీ మాస్టర్ షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో బలవంతం చేశాడని.. తన కోరిక తీర్చాలని నన్ను ఎంతో వేధించాడని.. తన కోరిక తీర్చకపోతే.. ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని.. తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ పై కేసు ఫైల్ చేసారు. ప్రస్తుతం జానీ పరారీ లో ఉన్నాడు. జానీ పై వేధింపుల కేసు నమోదు కావడం తో జనసేన పార్టీ..జానీ కి షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంద్దని ప్రకటించింది.