జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ వివరాలు

Polling details of the first phase of assembly elections in Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బుధవారం తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె తెలిపారు. కిశ్త్‌వాడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదు కాగా, పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు.

అన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. తొలి దశలో పోలింగ్ జరిగిన 24 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 23 లక్షల మంది ఓటర్లు ఉండగా, 219 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 15న, మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

కాగా, ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పక్షాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పి.డి.పి), కాంగ్రెస్ తదితర పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది