Police notice issued to former minister Kakani residence

Kakani : మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసుల నోటీసులు

Kakani: క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌ రెడ్డికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు.

Advertisements
మాజీ మంత్రి కాకాణి నివాసానికి

అయితే నోటీసు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు ఎస్సై హనీఫ్‌ నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లగా. ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. మాజీ మంత్రి ఇంటిలో లేకపోవడంతో ఆయన పారిపోయారనే ప్రచారం జరిగింది. నిన్న హైదరాబాద్‌ లోని తన నివాసంలో కాకాణి ఉగాది వేడుకలు చేసుకుంటున్న ఫొటోలను ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. కొందరు పోలీసులిచ్చిన ముందస్తు సమాచారంతోనే ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.

కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్‌ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉంది. దానికి లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు. లీజుదారుడు అంగీకరించకపోయినా ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారు. అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే ఈ దందా జరిగింది. దాని పై ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అప్పట్లో ఆందోళన కూడా చేశారు.

Related Posts
శామ్‌సంగ్ E.D.G.E సీజన్ 9 విజేతలు
Samsung announces winners o

గురుగ్రామ్, భారతదేశం - డిసెంబర్ 2024: శామ్‌సంగ్, భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, శామ్‌సంగ్ E.D.G.E తొమ్మిదవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. (ఎంపవరింగ్ డ్రీమ్స్ గెయినింగ్ Read more

షూటర్ మను భాకర్ ఇంట విషాదం
Bad news for Manu Bhaker

ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, Read more

వరంగల్ లో లక్ష మందితో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం
వరంగల్ లో లక్ష మందితో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం

వరంగల్ లో లక్ష మందితో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై Read more

బడ్జెట్ తర్వాత ఎమ్మెల్యేలతో బాబు భేటీ
బడ్జెట్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు కీలక భేటీ

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు పలు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×