saif ali khan

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసుల వివరణ

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడి గురించి పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా పోలీసులు గుర్తించారు. అతను బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ఎలా వచ్చాడు? ఏం చేశాడనే విషయాలను విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయలోని డౌకీ నదిగుండా భారత్‌లోకి అక్రమంగా జొరబడినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భారత్‌లోకి వచ్చాక తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని వారాలు ఉన్నాడని, ఆ తర్వాత ఉద్యోగం కోసం ముంబై వచ్చినట్లు చెప్పారు.

ముంబైకి రావడానికి ముందు బెంగాల్‌లో ఓ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్ కార్డును తీసుకున్నాడు. దీంతో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఉపయోగించిన సిమ్ కార్డు బెంగాల్‌కు చెందిన మరో వ్యక్తి పేరు మీద ఉంది. భారత్‌లోనే ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా బంగ్లాదేశ్‌కు చాలాసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ నెల 16న ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంటికి చోరీ కోసం వెళ్లిన ఈ బంగ్లాదేశీ… తనను అడ్డుకున్న సైఫ్ అలీఖాన్‌పై కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ అలీఖాన్ గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.

Related Posts
లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు
one nation one poll to be introduced in lok sabha on december 16

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో Read more

మన్మోహన్ సింగ్ ఆర్ధిక సంస్కరణల నాయకుడు
manmohan singh

అతి సామాన్య వ్యక్తిగా పుట్టి, అసమానమైన వ్యక్తిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధలో, అదీ Read more

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లా
ajay kumar bhalla

గత కొంతకాలంగా మణిపూర్ లో శాంతిభద్రతలు క్షిణించాయి. ఆ రాష్ట్ర సీఎంపై ప్రజలు అసంతృప్తితో వున్నారు. దీంతో ఆ రాష్ట్రముపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా కొత్త Read more

భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య
sad man

ఓ మహిళ తన భర్త కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసి, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటుచేసుకుంది. సంక్రైల్‌కు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *