నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్, మధురై-బెంగళూరు, యూపీలోని మీరట్-లక్నో మధ్య నడవనున్నాయి. దక్షిణ రైల్వేజోన్ కు చెందిన రెండు రైళ్లతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ లో మరో రైలు ప్రారంభిస్తారు. దక్షిణ భారత దేశంలో చెన్నై టు నాగర్‌కోయిల్ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు చెన్నైతో పాటు నాగర్‌కోయిల్ మధ్య నడవనుంది. ఈరైలు బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల పాటు నడుస్తుంది. ఈ రైలు చెన్నై, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మధురై, కోవిల్‌పల్లి, తిరునెల్వేలితో పాటు నాగర్ కోయిల్ వరకూ వెళుతుంది.

ఉదయం ఐదు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ కు చేరుకుంటుంది. మరొకటి మధురై – బెంగళూరు కంటోన్మెంట్ రైలు ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైలు దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాపురం స్టేషన్ల మీదుగా బెంగళూరుకు సెంట్రల్ కు స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం మినహా వారం రోజుల్లో మిగిలిన ఆరురోజులు నడుస్తుంది. మరో రైలు ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి లక్నో మధ్య నడుస్తుంది.