PM Modi will go on a foreign tour once again

మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మరోసారి ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోడీ పర్యటించనున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మోడీ 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆసియాన్ – ఇండియాకు లాహోస్ అధ్యక్షత వహిస్తోంది.

ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోడీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో – పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది అని విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా, ప్రధాని మోడీ …రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలను సందర్శించి .. యుద్ధం ముగింపు విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం మోడీ ఇటలీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో విస్తృత స్థాయిలో ఆయన చర్చలు జరిపారు.

Related Posts
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం

నీటి కొరతతో బాధపడుతున్న మునుపటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, పాలమూరు ప్రాంతం యొక్క నీటి వనరుల హక్కును భద్రపరచడానికి వేగంగా చర్యలు Read more

బాకులో COP29: ఫైనాన్స్ మరియు పర్యావరణ చర్చల్లో తీవ్ర సంక్షోభం
COP29

బాకులో జరుగుతున్న COP29 సమావేశం, గురువారం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సమావేశంలో పత్రికలో ఉన్న ఒక నిర్దిష్ట ప్యారాగ్రాఫ్ పై పలు దేశాలు అభ్యంతరాలను Read more

మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం
7 Kumbh returnees killed af

జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది తెలుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహాకుంభమేళా ముగించుకొని తిరిగొస్తుండగా, Read more

భవిష్యత్తులో 3.5 రోజుల పని వారాలు: AI ద్వారా పని సమయం తగ్గుతుందా?
ai

జేపీమోర్గాన్ సీఈఓ జేమీ డైమన్, భవిష్యత్ తరగతుల కోసం వారానికి 3.5 రోజుల పని వారాలను అంచనా వేస్తున్నారు. ఆయన అనుసరించిన అభిప్రాయం ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *