PM Modi to lay foundation stones of projects worth Rs 7600 cr in Maharashtra

నేడు రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (బుధవారం) మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌ మోడ్‌లో ఈ కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. ఇందులో ముఖ్యంగా నాగ్‌పూర్‌ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి రూ.7,000 కోట్ల విలువైన అప్‌గ్రేడింగ్ పనులను ప్రారంభించనున్నారు. అలాగే షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ కార్యక్రమాలను మోడీ ప్రారంభించబోతున్నారు.

అంతేకాకుండా ముంబై, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా కొత్తగా పది వైద్య కళాశాలలను ఇనాగ్యురేట్ చేయనున్నారు. చివరిగా టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై కేంద్రంలో విద్యా సమీక్షా కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

Related Posts
ఉత్తర కొరియా రష్యాకు మద్దతు: కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన
NO russia

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు నిరంతర మద్దతు తెలపాలని నిర్ణయించారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా ఏజెన్సీ శనివారంనాడు Read more

రజనీకాంత్ మూవీ లో సెట్ లో జాయిన్ అయినా అమిర్ ఖాన్
amir khan kuli

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం కూలీ పైన సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో Read more

గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం

నీటి కొరతతో బాధపడుతున్న మునుపటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, పాలమూరు ప్రాంతం యొక్క నీటి వనరుల హక్కును భద్రపరచడానికి వేగంగా చర్యలు Read more

పాపం కర్ణాటక సీఎంకు అసలు సొంత ఇల్లే లేదట..
karnataka cm siddaramaiah

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కాం విషయంలో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిజాయతీతో పనిచేశానని, అవినీతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *