నేను ఒక్కడినే రష్యాకు రాలేదు : ప్రధాని మోడీ

pm-modi-speech-for-indian-diaspora-in-moscow

మాస్కోః భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని… 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానని భావోద్వేగభరితంగా చెప్పారు.

ఇటీవలే తాను మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని, ఇక నుంచి మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భారత్ ను ఇప్పటికే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని, దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోడీ ఉద్ఘాటించారు.

భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని, మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని, డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు.