పోలాండ్‌, ఉక్రెయిన్‌ దేశాల పర్యటనకు వెళ్తున్నా ప్రధాని మోడీ

PM Modi is going on a visit to Poland and Ukraine
PM Modi is going on a visit to Poland and Ukraine

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేడు పోలాండ్‌, ఉక్రెయిన్‌ దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయ‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. సెంట్ర‌ల్ యూరోప్‌లో పోలాండ్ కీల‌క‌మైన ఆర్థిక భాగ‌స్వామి అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యం, బహుళ‌త్వానికి రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని, ఇది రెండు దేశాల బంధాన్ని బ‌లోపేతం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. రెండు దేశాల ప‌ర్య‌ట‌న‌కు ముందు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

పోలాండ్ ప్ర‌ధాని డోనాల్డ్ ట‌స్క్‌, అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడాతో భేటీకానున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించారు. పోలాండ్‌లో ఉన్న భార‌తీయ క‌మ్యూనిటీని క‌ల‌వ‌నున్న‌ట్లు చెప్పారు. అక్క‌డ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్ల‌నున్న‌ట్లు మోడీ తెలిపారు. దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేర‌కు ఉక్రెయిన్ వెళ్తున్న‌ట్లు చెప్పారు. భార‌తీయ ప్ర‌ధాని ఉక్రెయిన్‌కు వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉక్రెయిన్‌లో త్వ‌ర‌గా శాంతి, స్థిర‌త్వం రావాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.