pm modi enquiries with wife latha about rajinikanth health

ల‌తా ర‌జ‌నీకాంత్‌కు ప్రధాని మోడీ ఫోన్.. రజనీకాంత్‌ ఆరోగ్యంపై ఆరా..!

pm-modi-enquiries-with-wife-latha-about-rajinikanth-health

న్యూఢిల్లీ: ద‌క్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దాంట్లో స్టెంట్ అమర్చినట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి.

ఇక సూప‌ర్ స్టార్ ఆసుప‌త్రిలో చేర‌డంపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న ఆరోగ్యంపై స్పందించారు. ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ర‌జ‌నీ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న భార్య ల‌తా ర‌జ‌నీకాంత్‌కి ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్లు త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లై తెలిపారు.

ఈ మేర‌కు అన్నామ‌లై ఓ ట్వీట్ చేశారు. “సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి పీఎం మోడీ ఈరోజు లతా రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చికిత్స జ‌రిగిన తర్వాత ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగారు. త‌లైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు” అని అన్నామ‌లై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోడీతో క‌లిసి ఉన్న రజనీకాంత్ ఫొటోను ఆయ‌న జోడించారు.

ఇక అంత‌కుముందు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, మ‌రో స్టార్‌ న‌టుడు విజ‌య్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సూప‌ర్ స్టార్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ల‌తా ర‌జ‌నీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

Related Posts
నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ పై వైసీపీ సెటైర్లు..
lokesh delhi

త్వరలోనే రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. 'మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. Read more

సౌత్ కొరియా అధ్యక్షుడిపై దేశద్రోహం కేసు: విదేశాల ప్రయాణంపై నిషేధం
south korea president

సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై విదేశాలకు ప్రయాణించడంపై నిషేధం విధించబడింది. ఈ నిర్ణయం డిసెంబర్ 9న సౌత్ కొరియా పార్లమెంట్ కమిటీ సమావేశంలో దేశం Read more

ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more

ముంబైలో ఘోర బోటు ప్రమాదం..
mumbai boat accident

ముంబైలో బుధవారం మధ్యాహ్నం ఓ బోటు మునిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 77 మందిని రక్షించగా, 12 మందిని ఇంకా వెతుకుతున్నారు. ఈ సంఘటన Read more