PM Modi appointment papers for 71 thousand people today

71 వేల మందికి నేడు ప్రధాని నియామక పత్రాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా 71 వేల మంది యువకులకు మోడీ నియామక పత్రాలను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు.. అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకే భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisements

దీనికి సమాంతరంగా ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజ్ కూడా వ్యాపార, ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ కింద పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశల కల్పనకు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పథకాలు, కార్యక్రమాలకు ఉద్దీపనలు ప్రకటిస్తుంది. వాటితో పాటు ఉద్యోగాల కల్పనకు ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజన, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెంటర్ ఆత్మనిర్బర్ నిధి వంటి పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, హౌసింగ్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అదనంగా చేపట్టింది. ఇవన్నీ దేశంలో యువతకు ఉపాధికి ఉద్దేశించినవే.

కాగా, రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్దతకు ముందుగుడు. ఇది జాతి నిర్మాణం, స్యయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుంది. ఇక, రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటారు. దేశంలో ఉపాధి కల్పనతో పాటు యువత ఉపాధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం.

Related Posts
శ్రీచైతన్య కాలేజీలపై కొనసాగుతున్నఐటీ దాడులు
శ్రీ చైతన్యపై మరోసారి ఐటీ దాడులు – కోట్లలో అక్రమ లావాదేవీలు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ దాడులు Read more

సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత
Bank of Baroda presented donation cheque with CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటిని విరాళంగా అందించింది. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ Read more

దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు
దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు

శుక్రవారం ముగిసిన ఐదు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశం ద్వారా భారత్ మొత్తం ₹20 లక్షల కోట్ల రూపాయలకిపైగా పెట్టుబడుల హామీలను పొందినట్లు Read more

చైనాలో కొవిడ్‌ మాదిరి కొత్త వైరస్‌ గుర్తింపు !
Identification of a new virus similar to Covid in China!

జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు బీజీంగ్‌: చైనా లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు Read more

×