Piyush Goyal breaks down re

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు.

ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎమోషనల్ అయ్యారు. ‘నా ఆహ్వానం మేరకు ఆయన ఓరోజు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటారాయన. వెళ్లేటప్పుడు “నాతో ఫొటో దిగుతారా?” అని నా భార్యను అడిగారు. రతన్ తో ఫొటో దిగాలని ఎవరికి ఉండదు?’ అంటూ పీయూష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది తమకు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకమని వివరించారు.

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ సంపాదించారు. తరువాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా ఆయన పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌నకు కూడా నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది.

Related Posts
విడుదల 2 మూవీ రివ్యూ
విడుదల 2 మూవీ రివ్యూ

విడుదల 2 ప్రేక్షకులకు ఒక భావోద్వేగ రాజకీయ సందేశం విడుదల 2 మూవీ రివ్యూ: విజయ్ సేతుపతి చిత్రం ఒక బలమైన రాజకీయాలను ముందుకు తెస్తుంది రాజకీయాలను Read more

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..కీలక చర్చలు
Congress working committee meeting today.important discussions

న్యూఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ Read more

ఓ పార్టీలో ట్రంపును కలిసిన అంబానీ జంట
trump and muskesh couple

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత Read more

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం
ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న Read more