మార్కెట్ లోకి కొత్త సెక్యూరిటీ ఫీచర్:ఫోన్ పే

మార్కెట్ లోకి కొత్త సెక్యూరిటీ ఫీచర్:ఫోన్ పే

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సొల్యూషన్ ద్వారా ఫోన్‌పే యాప్ వినియోగదారులు తమ బ్యాంక్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు వంటి లావాదేవీలను మరింత సులభతరం చేసుకోవచ్చు.వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే, సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదని ఫోన్‌పే తెలిపింది. టోకనైజ్డ్ కార్డులను ఫోన్‌కు సురక్షితంగా అనుసంధానించడం వల్ల మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఆన్‌లైన్ చెల్లింపులపై భరోసా పెరుగుతుంది.

PhonePe 768x576 1

టోకనైజేషన్ అంటే ఏమిటి?

టోకనైజేషన్ అనేది కార్డు భద్రతను మెరుగుపరిచే సాంకేతికత. దీనిలో, వినియోగదారుల కార్డు వివరాలను భద్రత పరంగా ఓ ప్రత్యేక టోకెన్‌గా మార్చి స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే, వినియోగదారుల అసలు కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి సున్నితమైన వివరాలు స్టోర్ చేయబడవు. లావాదేవీల సమయంలో టోకెన్‌ను ఉపయోగించి చెల్లింపు చేయడం జరుగుతుంది.

ఫోన్‌పే వినియోగదారులకు ప్రయోజనాలు:

వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం వల్ల, లావాదేవీ సమయంలో అసలు కార్డు వివరాలు షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి లావాదేవీకి సీవీవీ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.టోకెనైజ్‌డ్ కార్డు వివరాలు ఫోన్‌పే అకౌంట్‌కు అనుసంధానించబడినందున, వేగంగా బిల్లులు చెల్లించవచ్చు.కార్డు వివరాలు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ట్రాన్సాక్షన్‌కు కొత్త టోకెన్‌ను ఉపయోగించే విధానం వల్ల, మర్చంట్ సైట్ లేదా యాప్‌లో అసలు కార్డు డేటా స్టోర్ చేయబడదు. ఇది వినియోగదారులకు భద్రతతో పాటు, గోప్యతను కూడా పెంచుతుంది.

ప్రారంభంలో వీసా కార్డులతో:

ప్రస్తుతం ఫోన్‌పే వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే టోకనైజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర నెట్‌వర్క్ కార్డుల కోసం కూడా ఈ ఫీచర్‌ను విస్తరించనున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. అలాగే, ఫోన్‌పే చెల్లింపు గేట్‌వే సేవలు అనుసంధానమైన ఆన్‌లైన్ వ్యాపారుల వద్ద కూడా వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు.

    వినియోగదారులకు సూచనలు:

    టోకనైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా, ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి.అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే బ్యాంకును సంప్రదించాలి.ఫోన్‌ను ఇతరులతో పంచుకోవద్దు, ప్రైవేట్ పిన్ లేదా ఫింగర్‌ప్రింట్ లాక్ సెట్ చేసుకోవాలి.

    ఫోన్‌పే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా, వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమనిపేర్కొంది. టోకనైజేషన్ ఫీచర్‌తో వినియోగదారులకు మరింత సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందించగలమనే విశ్వాసం ఉంది. ఇకపై వినియోగదారులు తమ కార్డు వివరాలను మర్చంట్ ప్లాట్‌ఫార్మ్‌లపై నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు.

    Related Posts
    హైదరాబాద్ పబ్‌లో అరెస్టులు
    BANJARA HILLS PUB

    హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో 100 మంది పురుషులు మరియు 40 మంది మహిళలు అరెస్టయ్యారు. అర్థరాత్రి సమయంలో Read more

    హైదరాబాద్‌ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్‌ను ప్రారంభించిన ‘‘విక్టర్‌’’..
    333

    -స్టోర్‌లో కస్టమర్‌లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్.. హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్‌ -2 బ్యాడ్మింటన్ బ్రాండ్ ‘‘విక్టర్ రాకెట్స్’’ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ Read more

    క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయం చేసిన ఐటీసీ నిమైల్
    ITC Nimile introduced Clean Equal Mission

    సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం క్లీన్ ఈక్వల్ టుడేని సమిష్టిగా నిర్మించే ఆలోచన రేకెత్తించే, కార్యాచరణ ఆధారిత ప్రయత్నం.. హైదరాబాద్: భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, Read more

    వండర్లా చిక్కూ యొక్క కొత్త అవతార్
    Wonderla New Avatar of Chikku, Thrilling New Adventures of Riddle Film Launch

    హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ గొలుసు సంస్థ అయిన వండర్లా హాలిడేస్ డైనమిక్ యువతరం ప్రాధాన్యతలకు అనుగుణంగా తన ప్రియమైన మస్కట్ చిక్కూని ఉత్తేజకరమైన కొత్త Read more