People should remember who committed the scam in Delhi.. Rahul

ఢిల్లీలో కుంభకోణానికి పాల్పడింది ఎవరో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి: రాహుల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆమ్‌ ఆద్మీ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో.. ఓటు వేసేటప్పుడు ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను ఉద్దేశించి రాహుల్‌గాంధీ ఈ కామెంట్ చేశారు.

image

ఓటు వేసేటప్పుడు ఢిల్లీలో కాలుష్యం, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. పని చేయనివాళ్లను మళ్లీమళ్లీ గెలిపించి ఓటును వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ హక్కులను తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతమై ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు.

ఇక, ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. పాలనా రికార్డు, సంక్షేమ పథకాలే ఆధారంగా వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లోనైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి. ఢిల్లీలో 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Related Posts
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Extension of application de

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ Read more

బస్సును ఢీకొట్టిన వ్యాన్‌.. 9 మంది మృతి
bus accident

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు Read more

కుంభ మేళాలో టీటీడీ కియోస్క్ ఏర్పాటు
kumbha mela

మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ Read more

70 గంటల వర్క్ వీక్: మరోసారి నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
murthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పలు సార్లు వివాదాలకు గురైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనాన్ని సృష్టించారు.. ముంబైలో నవంబర్ 14, 2024 న జరిగిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *