PCC chief appeals to movie stars to end this controversy

ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..

PCC chief appeals to movie stars to end this controversy.
PCC chief appeals to movie stars to end this controversy.

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్య‌ల‌ని, వాటిని ఉప‌సంహరించుకున్నట్లు సురేఖ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. దీనిపై మీడియాతో చెప్పడంతో పాటు ఎక్స్ వేదిక‌గా కూడా మంత్రి పోస్టు పెట్టార‌ని తెలిపారు.

అందుకే సినీ ప్ర‌ముఖులు ఈ అంశానికి ముగింపు ప‌ల‌కాల‌ని కోరారు. మ‌హిళ‌ల ప‌ట్ల కేటీఆర్ చిన్న‌చూపు ధోర‌ణిని ప్ర‌శ్నించడం త‌ప్పితే.. ఎవ‌రి మ‌నోభావాల్నీ దెబ్బ‌తీయ‌డం త‌న ఉద్దేశం కాద‌ని సురేఖ పేర్కొన్న‌ట్లు మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరువైపులా కూడా మ‌హిళలు ఉన్న విష‌యాన్ని సినీ ప్ర‌ముఖులు గుర్తించాల‌ని కోరారు.

“మంత్రి కొండా సురేఖ‌పై కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఓ సోద‌రికి ఓ సోద‌రుడిగా నూలుపోగు దండ వేసిన విధానాన్ని ట్రోల్ చేయ‌డం జ‌రిగింది. దీన్ని సినిమావాళ్లు కూడా చూసి ఉండొచ్చు. దీంతో ఆ మ‌హిళ ఎంత బాధ‌ప‌డ్డారో ఆలోచించండి. బేష‌ర‌తుగా సురేఖ త‌న వ్యాఖ్య‌ల్ని ఉప‌సంహ‌రించుకున్నారు. ఇక‌పై కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి” అని మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Related Posts
అల్లుఅర్జున్‌ను కలిసిన చిరంజీవి సతీమణి సురేఖ
surekha alluarjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం శనివారం ఉదయం తన మేనత్త, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బన్నీ జైలు Read more

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్
VRR report

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర రాఘవరెడ్డి ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు Read more

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం..ఎక్కడివో తెలుసా..?
Rs.20 lakhs is available in

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కాకపోతే ఇదంతా కూడా దొంగసొమ్ము అని తేలింది. ఒడిశాకు చెందిన ఓ Read more