మోటార్‌ పాలసీలలో పీబీ పార్ట్‌నర్స్‌ గణనీయమైన వృద్ధి

PB Partners has seen significant growth in motor policies

హైదరాబాద్ : పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్ల ఆధ్వర్యంలోని బ్రాండ్ పీబీ పార్ట్‌నర్స్, తన విలక్షణమైన పాయింట్స్ ఆఫ్ సేల్ పర్సన్ (PoSP) మోడల్‌తో బీమా పరిశ్రమలో కొత్త కొలమానాలను, మైలురాళ్లను నెలకొల్పుతోంది. కంపెనీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో తాజా మోటారు బీమా కొనుగోలు పోకడలను, ఈ విభాగంలో సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రత్యేకంగా వివరించింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్, మోటార్ బిజినెస్ అమిత్ భడోరియాతో పాటు పీబీ పార్ట్‌నర్స్ నుంచి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సమగ్ర, మాడ్యులర్ మోటార్ బీమా ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇది వచ్చిన రాబడి మొత్తంలో 75% వాటాతో అతిపెద్ద ఆదాయ కంట్రిబ్యూటర్‌గా ఉంది. పీబీ పార్ట్‌నర్స్ మోటారు బీమా విభాగంలో, వాణిజ్య వాహనాలు అత్యధికంగా 48%, అనంతరం ప్రైవేట్ వాహనాలు 35% విక్రయం అవుతున్నాయి.

తెలంగాణ, ఒక కీలకమైన మార్కెట్‌గా, ఆకట్టుకునే 5,500+ ఏజెంట్ భాగస్వాములను కలిగి ఉంది. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా బీమాను స్వీకరించడంలో ఈ ప్రాంతం కీలక పాత్రను ఇది తెలియజేస్తోంది.

ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు:

హైదరాబాద్‌లో కొత్త పోకడలు, బీమా కొనుగోలు ప్రవర్తన మరియు పోకడలు: ఇటీవల, హైదరాబాద్‌కు చెందిన ప్రజలలో మాడ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ రక్షణ, యాడ్-ఆన్‌లకు సంబంధించిన అవగాహన గణనీయంగా పెరిగింది. అత్యాధునిక సాంకేతికత సరైన మిశ్రమం మరియు ఏజెంట్ భాగస్వాముల వ్యక్తిగత సేవలు అందుబాటులో ఉండడంతో, ఈ ప్రాంతంలో బ్రాండ్‌ విజయానికి గణనీయంగా దోహదపడింది.

‘‘హైదరాబాద్ ప్రజలలో పెరిగిన అవగాహన పే యాజ్ యు డ్రైవ్ వంటి మాడ్యులర్ బీమా ప్లాన్‌ల కొనుగోలులో గణనీయమైన పుంజుకోవడానికి దారితీసింది. దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణ మరియు హైదరాబాద్‌లో మా ఉనికిని విస్తరించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. పీబీ పార్ట్‌నర్స్ ప్రతిచోటా అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా అత్యంత మారుమూల గ్రామాలకు కూడా చేరుకోవడమే మా లక్ష్యం. అలాగే, 2027-28 నాటికి, వైజాగ్, తిరుపతి, కోయంబత్తూర్ మరియు ఇతర నగరాలతో సహా దక్షిణ భారతదేశంలో దాదాపు 17-18 కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మేము ప్రణాళికను రూపొందించుకున్నాము. ఆంధ్ర మరియు తెలంగాణ ఏజెంట్ భాగస్వాముల కోసం మా కొత్త కాల్ సెంటర్‌తో, రాబోయే సంవత్సరంలో విక్రయించే మోటారు బీమా పాలసీలలో ఘనమైన వృద్ధిని మేము అంచనా వేస్తున్నాము. దక్షిణాదిలోని మా ఏజెంట్ భాగస్వాములకు మద్దతు ఇచ్చేందుకు, ఈ రాష్ట్రాల్లో మా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మేము అంకితభావంతో ఉన్నాము. అక్టోబర్ నెలాఖరులోగా మా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభిస్తాము’’ అని పీబీ పార్ట్‌నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్ మరియు సేల్స్ హెడ్ అమిత్ భడోరియా వివరించారు.

మీ వాహనాన్ని రక్షించేందుకు మాన్‌సూన్ ప్రత్యేక నిపుణుల చిట్కాలు మరియు బీమా యాడ్-ఆన్‌లు: దీని గురించి అమిత్ మరింత వివరిస్తూ, “ఈ వర్షాకాలంలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్ ఆన్‌ల కోసం డిమాండ్‌లో 65% గణనీయమైన వృద్ధిని మేము చూశాము. ఆర్‌ఎస్‌ఏ (RSA) కవర్, ప్రత్యేకించి, మహిళలు మరియు మిలీనియల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన యాడ్-ఆన్‌గా మారింది. ఇది ఆరోగ్యకరమైన మోటారు బీమా ఆఫర్‌ల గురించి పెరుగుతున్న అవగాహనను చాటి చెబుతోంది.

ఆన్-డిమాండ్ చెల్లింపు ద్వారా పరిశ్రమ-మొదటి ఆవిష్కరణ: పీబీ పార్ట్‌నర్స్ వారి ఆన్ డిమాండ్ పేఅవుట్ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసింది. ఇది తక్షణ చెల్లింపు ఉపసంహరణలను అందిస్తోంది. దీని సహాయంతో, ఏజెంట్ భాగస్వాములు పాలసీ విక్రయాన్ని పూర్తి చేసిన వెంటనే చెల్లింపును కోరవచ్చు. నిధులు సాధారణంగా అదే రోజు లేదా మరుసటి రోజు ప్రాసెస్ అవుతాయి.

అనుజ్ అగర్వాల్, ఏవీపీ – మోటార్ బిజినెస్, సౌత్ ఇండియా మాట్లాడుతూ, ‘‘మా ఆన్-డిమాండ్ పేఅవుట్ ఫీచర్‌తో, పీబీ పార్ట్‌నర్స్ గర్వంగా 70% ఏజెంట్ భాగస్వాములు తమ పేఅవుట్‌లను ఒకే రోజు సమయంలో స్వీకరిస్తారని ధీమాగా చెబుతున్నాము. ప్రతి రోజు చివరిలో, ఏజెంట్ భాగస్వాములు తమ నిధులను పొందవచ్చు. అలాగే, 2022లో ప్రవేశపెట్టబడిన ఈ పరిశ్రమ-మొదటి ఫీచర్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం, మా ఏజెంట్ భాగస్వాముల్లో సుమారు 70% మంది ఈ ఫీచర్‌ను వినియోగించుకుంటుండగా, 65% నెలవారీ చెల్లింపులు మరియు కమీషన్‌లు దీని ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి.

పీబీ పార్ట్‌నర్స్ 7-ఏళ్ల ప్రణాళిక 90-95% ఏడాది నుంచి ఏడాదికి (YOY) వ్యాపార వృద్ధిని సాధించి, నిర్వహిస్తూ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం మోటారు బీమా రంగంలో స్థిరమైన వృద్ధి, శ్రేష్ఠతకు పీబీ పార్ట్‌నర్స్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.