Pawan Varahi public meeting in Tirupati today

నేడు తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభ

Pawan Varahi public meeting in Tirupati today

అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ నిర్వహించే వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే సభలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పవన్ ప్రకటించే డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ కల్యాణ్ ఏమి సందేశం ఇస్తారు అనేది దానిపై అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. తిరుపతి క్షేత్రంగా జరుగుతున్న ఈ వారాహి బహిరంగ సభకు రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హజరవుతారని భావిస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ మూడు రోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతి లడ్డూ అంశంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కల్యాణ్ .. నిన్న శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు.

Related Posts
మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Bomb threats to Delhi schools again

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం Read more

చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు భారీ జరిమానా
BRS Ex MLA Chennamaneni Ram

తెలంగాణ హైకోర్టు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ నిర్ణయం చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు ధ్రువీకరించడంతో Read more

మగవాళ్లు జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..
Do this to prevent male hai

జుట్టు రాలడం చిన్న విషయం కాదు. అసాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదని చెప్పడానికి, దానిపట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించే మొదటి సంకేతం. Read more

పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు- వెంకటేశ్ విన్నపం
venky speech

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన Read more