19న పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాదు బరిలో నిల్చున్న తన పార్టీ సభ్యులు 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ బరిలో విజయం సాధించి 100 % విజయం తో చరిత్రలో నిలిచారు. దీంతో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పటించారు.

‘పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్య తలను కేటాయించారు. జనసేనాని ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో కేడర్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి’ అని జనసేన పార్టీ Xలో పోస్ట్ చేసింది. దీంతో పవను కు అందరూ ‘ALL THE BEST’ చెబుతున్నారు.

అలాగే జనసేనకు చెందిన మరో ఇద్దరు శాసన సభ్యులు- నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కూ కేబినెట్ హోదా లభించింది. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాదెండ్ల స్వీకరించారు. పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ శాఖలు కందుల దుర్గేష్‌కు దక్కాయి. వీరు కూడా ఇప్పటికే తమ బాధ్యతలను స్వీకరించి పని మొదలుపెట్టారు.