Pawan Kalyan visit to Cochin tomorrow.

రేపు కొచ్చిన్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన..!

రేపటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.

image

ఇందులో, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంకల్పించారు. మూడు రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళుతున్నారు. అయితే ఇప్పటికే సనాతన ధర్మ‌ బోర్డు ఏర్పాటుకు డిప్యుటీ సీఎం పవన్ సంకల్పించిన విషయం తెలిసిందే.

Related Posts
ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి : చంద్రబాబు
రేపు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

అమరావతి: ప్రతి ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి.. దీనిపై రాబోయే రోజుల్లో మానిటర్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన Read more

పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం
Fog effect.. Many flights are delayed

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు Read more

Manda krishna: ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర: మందకృష్ణ
Chandrababu Naidu played a key role in the unanimous resolution on SC classification.. Manda Krishna

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని అన్నారు. ఎస్సీ Read more

ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అసెంబ్లీకి జగన్ – నిమ్మల విమర్శలు
jagan ap assembly

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి Read more