నేడు శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన అక్కడికి చేరుకుని స్పేస్ డే ఈవెంట్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాకెట్ ప్రయోగ వేదికను సందర్శిస్తారు. అనంతరం ఆయన తిరుగు పయనమవుతారు. కాగా పవన్ పర్యటనకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు.