pawan kalyan to participate in palle panduga in kankipadu

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. పల్లె పండుగ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కంకిపాడులో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో నిర్మించే రెండు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. కంకిపాడులోని టీడీపీ కార్యాలయం ఆవరణలో సభను నిర్వహించనున్నారు. ఇంకోవైపు, కంకిపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొననున్నారు.

Related Posts
అలీ ఖాన్ దాడి పై ఊహించని బిగ్ ట్విస్ట్
అలీ ఖాన్ దాడి పై ఊహించని బిగ్ ట్విస్ట్

ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన కేసు వివాదంలో చిక్కుకుంది.ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక Read more

ఏపీలో 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు – మంత్రి డా.నిమ్మల రామానాయుడు
Elections to irrigation soc

అమరావతి : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం Read more

‘గేమ్‌ ఛేంజర్‌’ లీక్‌పై నిర్మాత ఆవేదన
'Game changer' police instr

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన భారీ బడ్జెట్‌ పొలిటికల్‌ డ్రామా 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer Read more

అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం పోలింగ్‌..
Assembly elections.. 46.55 percent polling till 3 pm

న్యూఢిల్లీ : ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *