Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడే సమయానికి పవన్ అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.తన పర్యటనను కొనసాగిస్తూ, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ఉంది. పర్యటన పూర్తయ్యాకే సింగపూర్ వెళ్తాను” అని ఉదయం మీడియాతో చెప్పారు. ఈ విషయంపై అతని నిశ్చయాన్ని చూసిన అభిమానులు మరింత గర్వపడిపోయారు.సాయంత్రం వరకు పర్యటన పూర్తి చేసుకుని పవన్ విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చారు. కొడుకు గాయపడిన విషయంపై తొలిసారి స్పందించారు. “అదేదో చిన్న ఘటన అనుకున్నా.

Advertisements
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్

కానీ అసలు విషయం తెలిసినప్పుడు షాక్ అయ్యాను” అని ఆయన చెప్పారు.ఆదిలోన విషయం అంతగా అర్థం కాలేదు. చిన్న గాయం అనుకున్నాను. తర్వాత ఆసుపత్రిలో చేర్చారని తెలిసి కలత కలిగింది, అని చెప్పిన పవన్ కళ్యాణ్ గళం కొంచెం కంపించిపోయింది.“తన ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారట. మా అబ్బాయి పక్కనే కూర్చున్న క్లాస్‌మేట్‌కి తీవ్రమైన గాయాలయ్యాయట. ఇంకా వేరే ఓ చిన్నారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసి హృదయం గులికి పోయింది, అంటూ తన బాధను పంచుకున్నారు.ఈ అగ్నిప్రమాదం సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిందని, ఇది నిజంగా దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. “బిడ్డలు అక్కడ సురక్షితంగా ఉంటారని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ ఇలాంటి సంఘటనలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి” అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడుతోందని తెలిపారు. “డాక్టర్లు మంచి కేర్ తీసుకుంటున్నారు. త్వరలోనే మార్క్ కోలుకుంటాడని ఆశిస్తున్నాం” అన్నారు.పవన్ కల్యాణ్ మాటల్లో తండ్రిగా ఉండే ఆత్మీయత, ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆయన అభిమానులు, ప్రజలు సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ మార్క్’ అంటూ మద్దతు తెలుపుతున్నారు.ఈ ఘటన తాలూకు హృదయవిదారక పరిణామాలు ప్రతి ఒక్కరికీ ఆవేదన కలిగిస్తున్నాయి. కానీ పవన్ తాత్కాలికంగా అయినా ప్రజాసేవలో నిలిచిన తీరు అందరికీ ప్రశంసనీయమైంది.

READ ALLSO : అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన

Related Posts
జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం
lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ Read more

ప్రేవేట్ బడుల్లో ఫ్రీ సీట్ల పై ప్రభుత్వం కసరత్తు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా Read more

కేటీఆర్‌పై కేసు నమోదు
KTR responded to ED notices

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు Read more

Gold Price : ప్రతీకారం ఎఫెక్ట్..గోల్డ్ ప్రియులకు షాక్
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులు, వాణిజ్య యుద్ధాల ఉత్కంఠ నేపథ్యంలో బంగారం ధరలు చరిత్రలో తొలిసారిగా అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×