Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి రెండురోజుల పాటు మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ(శనివారం) మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Advertisements

అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గం.కు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు(17వ తేదీ) విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆదివారం ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Related Posts
పెరిగేవి..తగ్గే ధ‌ర‌లు ఇవే!
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన Read more

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Special meeting of Telangana Assembly today

హైదరాబాద్‌: ఈరోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో.. కులగణన సర్వే రిపోర్టును ఆమోదిస్తారు. అలాగే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ Read more

Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన
Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన అమానుష ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనను దుర్వినియోగానికి గురిచేశారని ఓ న్యాయవాది Read more

Wife Harassment: :రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం చేస్తా..ఓ భార్య డిమాండ్!

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ తన భార్య నుండి భరించలేని వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుకు రూ. 5,000 ఇస్తేనే కాపురం చేస్తానని Read more

×