Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి రెండురోజుల పాటు మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ(శనివారం) మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గం.కు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు(17వ తేదీ) విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆదివారం ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Related Posts
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు
park

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు - మంత్రి నారా లోకేష్విజయవాడ : పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభిస్తుందని మంత్రి Read more

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
pawan kalyan

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

ముండ్లమూరులో వరుసగా భూప్రకంపనలు
earthquakes prakasam distri

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. Read more

13 దేశాల నుండి 75 కు పైగా విశ్వవిద్యాలయాలతో హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రపంచ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించిన టెక్సాస్ రివ్యూ..
The Texas Review organized the largest World Education Fair in Hyderabad with over 75 universities from 13 countries

హైదరాబాద్‌ : వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ యుఎస్ఏ , యుకె , ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలతో సహా 13 దేశాలకు చెందిన 75 పైగా విశ్వవిద్యాలయాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *