నాకు జీతం అవసరం లేదు – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

నాకు జీతం అవసరం లేదు నా దేశం కోసం, నా నేల కోసం నేను పని చేస్తాను అని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరి నుండి ఎమ్మెల్యే ల వరకు ఈ పంపిణి లో పాల్గొన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను తీసుకున్నవి శాఖలు కీలమైనవి కావడం తో తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను. పంచాయతీ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో సెక్షన్ లో నాలుగేసి గంటలు కూర్చుంటే ఎన్నెన్ని కోట్లు పోయాయి తెలుస్తుంది. నా ఎకౌంట్స్ కి 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక గంట సేపు కూడా కూర్చోలేదు. ప్రజల సొమ్ము కోసం ఎక్కడికి పోయాయో అని ఒక్కో సెక్షన్ లో నాలుగైదు గంటలు కూర్చున్నాను. ఒకప్పుడు నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను కానీ ఈ నిధులు చూస్తే తీసుకోకూడదని అనుకుంటున్నాను. నాకు జీతం అవసరం లేదు నా దేశం కోసం, నా నేల కోసం నేను పని చేస్తాను అని అన్నారు.

గతంలో జీతం తీసుకుంటా..నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని అడగాలి. మనం పనిచేయకపోతే మా ట్యాక్స్ మనీతో శాలరీలు ఇస్తున్నాం, ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలు అడగాలి. అందుకు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. ప్రజల డబ్బు శాలరీగా తీసుకుంటున్నాను అనే భయంతో నేను పనిచేస్తాను అని తెలిపారు..కానీ ఇప్పుడు తీసుకోనని తెలిపాడు.